ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ట్రైలర్ దసరా కానుకగా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ కామెడీలో డార్లింగ్ రెండు విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. కామెడీ, రొమాన్స్, హర్రర్ అంశాలు ఉండేలా ట్రైలర్ కట్ చేశారు. అయితే వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ ఆశించిన స్థాయిలో లేవని విమర్శలున్నాయి. ముఖ్యంగా థమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ ఎలా ఉందో మీరూ చూసేయండి.
రెబల్ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఇది డార్లింగ్ కెరీర్ ఫస్ట్ రొమాంటిక్ హర్రర్ ఫాంటసీ కామెడీ సినిమా. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను దసరా కానుకగా తాజాగా విడుదల చేశారు.