త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చిన అల్లు అర్జున్.. చివరికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమాను లైన్‌లో పెట్టాడు. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా సినిమా ఇటీవలే ముంబైలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బన్నీ టీం కొత్త లొకేషన్ల వేటలో భాగంగా అబుదాబికి పయనమైనట్టు సమాచారం.
కాగా అల్లు అర్జున్, అట్లీ జపనీస్ బ్రిటీష్ డ్యాన్సర్, కొరియోగ్రఫర్ హొకుటో కొనిషితో దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. హొకుటో కొనిషి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అల్లు అర్జున్ సినిమాకు పనిచేయడం పట్ల తన ఎక్సైట్‌మెంట్‌ను తెలియజేస్తూ బీటీఎస్ స్టిల్స్ షేర్ చేసుకున్నాడు. హొకుటో అల్లు అర్జున్‌తో ఓ పాట కంపోజ్ చేశాడట. అట్లీ మరి బన్నీ కోసం ఎలాంటి స్టైలిష్ సాంగ్స్ రెడీ చేస్తున్నాడోనంటూ తెగ చర్చించుకుంటున్నారు సినిమా లవర్స్.
ఈ సినిమాకి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
