‘విరూపాక్ష’ సినిమాతో హిట్ అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హర్షితతో ఆయన నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నాగ చైతన్య – శోభిత ధూళిపాళ దంపతులు ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే హీరో సాయి దుర్గ తేజ్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
వధూవరులను ఆశీర్వదిస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుకుమార్ దర్శకత్వ విభాగంలో పనిచేసిన కార్తీక్, ‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని సాధించారు.
