స్వర్గీయ అల్లు రామలింగయ్య వేసిన పునాదులపై నిర్మాణాత్మకంగా ఎదిగిన ఈ కుటుంబాన్ని, ఆయన కుమారుడు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్‌గా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. అల్లు అరవింద్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతుండగా, మూడో కుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, అల్లు శిరీష్‌కు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో వివాహం నిశ్చయమైనట్లు కుటుంబవర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు నిశ్చితార్థానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. శుభకార్యానికి ఏర్పాట్లు జరుపుతున్న సమయంలోనే , అల్లు రామలింగయ్య సతీమణి, శిరీష్ బామ్మ అయిన కనకరత్నమ్మ మరణంతో పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే అల్లు శిరీష్ నిశ్చితార్థానికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం. పెళ్లి కూడా ఎంతో గ్రాండ్‌గా, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- September 27, 2025
0
118
Less than a minute
Tags:
You can share this post!
administrator


