వెంక‌టేష్ సినిమాకు కొత్త టీమ్‌తో త్రివిక్ర‌మ్.!

వెంక‌టేష్ సినిమాకు కొత్త టీమ్‌తో త్రివిక్ర‌మ్.!

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా పూజా కార్య‌క్రామాలు పూర్తి చేసుకున్న చిత్ర‌యూనిట్‌ అక్టోబ‌ర్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నుంది. ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ 77 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రాబోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా ఒక విష‌యం వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా కోసం త్రివిక్ర‌మ్ త‌న టీమ్ మొత్తాన్ని మార్చిన‌ట్లు తెలుస్తోంది. కొత్త‌వారిని ఈ సినిమా కోసం తీసుకున్న‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్ న‌డుస్తోంది. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజం అనేది తెలియాల్సి ఉంది.

editor

Related Articles