దర్శకుడు వై.వి.ఎస్. చౌదరికి మాతృ వియోగం..

దర్శకుడు వై.వి.ఎస్. చౌదరికి మాతృ వియోగం..

దర్శకుడు వై.వి.ఎస్. చౌదరికి మాతృ వియోగం..

టాలీవుడ్ దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచిలి రత్నకుమారి గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. వయోభారంతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు. వైవిఎస్ చౌద‌రి తల్లి మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సన్నిహితులు వైవిఎస్‌ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ విషాద సమయంలో తల్లి ప్రేమను, గౌరవాన్ని చూపిస్తూ వైవిఎస్ చౌదరి భావోద్వేగంతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తల్లి రత్నకుమారిని గుర్తు చేసుకుంటూ.. పెద్ద‌లు ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు. ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్లని చూసి మందలిస్తూ ఉంటారు. అలాంటి సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు. కానీ.. ఒక లారీ డ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలవారీ సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుంచీ దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిల్వ పచ్చళ్లు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. తన నోటి మీది లెక్కలతో బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మ. వైవిఎస్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాలని’ సినీ కుటుంబంలోని యావన్మంది ప్రార్థిస్తున్నారు.

editor

Related Articles