3 ని. 30 సె.తో ప్ర‌భాస్ సినిమా ట్రైల‌ర్ త్వరలో..

3 ని. 30 సె.తో ప్ర‌భాస్ సినిమా ట్రైల‌ర్ త్వరలో..

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’ నుండి ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇప్పటికే గ్లింప్స్, టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. అయితే ట్రైలర్‌ను యూవీ క్రియేషన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. అదేరోజు విడుదల కాబోతున్న ‘కాంతారా ఛాప్టర్ 1’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్’ ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌కు U/A సర్టిఫికెట్ లభించింది. ఈసారి డైరెక్టర్ మారుతి, టీజర్‌లో చూపించిన రొమాంటిక్, కామెడీ షేడ్స్‌కి భిన్నంగా, హర్రర్ – యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్రైలర్‌ను రెడీ చేశాడట. దీంతో సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో వీటీవీ గణేష్, షకలక శంకర్ కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా తెరపై కనిపించనున్నాడు.

editor

Related Articles