రీసెంట్గా మన టాలీవుడ్ నుండి వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో హీరో తేజ సజ్జ నటించిన సినిమా మిరాయ్ కూడా ఒకటి. రెండు వారాల నుండి హౌస్ఫుల్ కలెక్షన్లతో మన తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్లో ఈ సినిమాకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మరి ఈ నేపథ్యంలో అవైటెడ్ సినిమా ఓజి రిలీజ్కి వస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఓజి సినిమా కోసం మిరాయ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గ్రేట్ స్టెప్ తీసుకున్నట్టుగా ఇపుడు వినిపిస్తోంది. తన సినిమా విజయవంతంగా రన్ అవుతున్నప్పటికీ రెండు తెలుగు స్టేట్స్లో మిరాయ్ ఉన్న స్క్రీన్స్ని ఓజి కోసం ఈ 25న కేటాయిస్తున్నట్టుగా టాక్ వైరల్ అవుతోంది. అలాగే 26 నుండి కొన్ని థియేటర్స్లోకి మళ్ళీ మిరాయ్ యధాతథంగా ప్రదర్శింపబడుతుంది. దీంతో టీజీ విశ్వప్రసాద్ తీసుకున్న నిర్ణయానికి పవన్ ఫ్యాన్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
- September 24, 2025
0
110
Less than a minute
You can share this post!
editor

