గత నెల చివరలో థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సినిమా స్ప్లిట్స్‌విల్లే. మైఖేల్ ఏంజెలో కోవినో రచించి, దర్శకత్వం చేయడంతో పాటు కీలక పాత్రలో నటించి ఓ నిర్మాత గాను వ్యవహరించాడు. ఈ సినిమాలో హాలీవుడ్ అగ్ర నటీమణి, కుర్రకారు డ్రీమ్ గర్ల్ డకోటా జాన్సన్ ప్రధాన ఆకర్షణ. అడ్రియా అర్జోనా, మైఖేల్ ఏంజెలో కోవినో, కైల్ మార్విన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడీ సినిమా చడీ చప్పుడు కాకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
మనం ఇప్పటివరకు భార్యాభర్తల నడుమ రిలేషన్స్ విషయంలో వింటూ వచ్చిన వాటిని మించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. కొత్తగా ఓపెన్ రిలేషన్ షిప్ (పెళ్లి చేసుకున్న జంటలు తమకు నచ్చిన ఇతరులతోనూ గడపొచ్చు, ఎలాంటి సంబంధాలైనా పెట్టుకోవచ్చు) నేపథ్యంలో సినిమా ఉంటుంది.

