బాలికా వధూ (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటి అవికా గోర్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. చిన్న వయసులోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె, తెలుగు సినిమాల్లోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటించినప్పటికీ, అనుకున్నంత బ్రేక్ ఆమెకు రాలేదు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అవికా, ఇప్పుడు జీవితంలో కొత్త అడుగు వేయడానికి సిద్ధమైంది. సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానీతో ఆమె పెళ్లి జరగనుంది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో పడ్డారు.
ఓ రియాల్టీ షోలో జంటగా పాల్గొన్నప్పుడు తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. 2020 నుండి ప్రేమలో ఉన్న వీరు, ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి డేట్‌ను కన్ఫర్మ్ చేసింది అవికా. వీరిద్దరూ సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేడంతో ఆమె ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు కూడా అవికాకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక కార్యకర్త అయిన మిలింద్ చంద్వానీతో 2020 నుండి డేటింగ్లో ఉన్న అవికా 2019లో ఓ ప్రోగ్రామ్‌లో భాగంగా మిలింద్‌ను కలిసింది అవికా. అలా దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకి ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేయడంతో వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారట. ఇప్పుడు పెళ్లి చేసుకోడానికి సిద్ధమైంది.