తాజాగా ఆర్జీవి.. మెగా ఫ్యామిలీకి ఓ అద్భుతమైన సలహా ఇస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఓ ఎమోషనల్ నోట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. 22 సెప్టెంబర్ 1978న ‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా మీ ముందుకొచ్చాను. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో మీరు చూపిన ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అంటూ పేర్కొన్నారు. అన్నయ్య ట్వీట్‌పై స్పందించిన పవన్ కళ్యాణ్.. “పుట్టుకతోనే మా పెద్దన్నయ్య ఓ ఫైటర్. రిటైర్మెంట్ అనేది ఆయన జీవితంలో లేదు. ఇతరులకు అండగా నిలిచే గుణం ఆయనది” అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి స్పందించిన చిరంజీవి.. “ధన్యవాదాలు తమ్ముడూ… నీ మాటలు నా మనసుకు తాకాయి. ‘ఓజీ’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించాలి” అంటూ ఆశీర్వదించారు. ఈ భావోద్వేగ ట్వీట్ల మధ్య రంగంలోకి దిగిన ఆర్జీవీ, తనదైన స్టైల్లో స్పందించాడు. చిరు, పవన్ కలిసి సినిమా చేస్తే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లందరికీ అది ఒక మెగా పవర్ ఫేవర్ అవుతుందని.. అది ఈ శతాబ్దానికి మెగా పవర్ ఫిలిం తప్పక అవుతుందని తెలియజేశారు.

- September 23, 2025
0
3
Less than a minute
Tags:
You can share this post!
editor