నరేంద్రమోదీ  ప్రీమియర్‌ షోలో  పాల్గొన్న జాన్వీకపూర్‌

నరేంద్రమోదీ  ప్రీమియర్‌ షోలో  పాల్గొన్న జాన్వీకపూర్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌. ఆయన నిర్ణయాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ‘మేరా దేశ్‌ పహ్లే: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ నరేంద్రమోదీ’  ప్రీమియర్‌లో  పాల్గొన్న జాన్వీకపూర్‌.. మోదీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ కాన్సర్ట్‌ను నిర్వహించారు.
జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ ‘ఈ వేదికపై నేనూ ఉండటం చాలా సంతోషాన్ని ఇస్తోంది. మన దేశంలో ఉన్న అందరికీ  మోదీ కథ గురించి తెలుసు. కానీ, ఒక నటిగా ఈ ఈవెంట్‌కు రావడం, ఆయన కథ వినడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మోదీ జీవితం, ఆయన దేశం కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చేసే ప్రతిపని అందరికీ స్ఫూర్తినిస్తుంది’ అని జాన్వీకపూర్‌ అన్నారు.

మేరా దేశ్‌ పహ్లే: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ నరేంద్రమోదీ’ విషయానికొస్తే.. ప్రముఖ రచయిత మనోజ్‌ ముంతాషిర్‌ ఈ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన బాల్యం నుండి జాతీయ నాయకుడిగా ఎదిగిన తీరును పాట రూపంలో రూపొందించారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

editor

Related Articles