వెంకటేష్‌కు  సూపర్  ఫామ్‌  స్టార్ట్..

వెంకటేష్‌కు  సూపర్  ఫామ్‌  స్టార్ట్..

టాలీవుడ్ హీరో వెంకటేష్‌ మరోసారి తన సూపర్ ఫామ్‌ను చూపిస్తూ తన కెరీర్‌లో గోల్డెన్ ఫేజ్‌ను ప్రారంభించారు. మూవీ మొఘల్ డి.రామానాయుడు వారసుడిగా ‘కలియుగ పాండవులు’తో వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ, కొన్ని ఏళ్లుగా ఫ్యామిలీ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ తనదైన స్థానం సంపాదించుకున్నారు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక కాస్త నిరాశ‌లో ఉన్న వెంకటేష్‌, 2025 ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బంపర్ హిట్ కొట్టి తిరిగి ట్రాక్‌లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, తెలుగు సినిమా రికార్డుల్లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాతో వెంకటేష్‌ సీనియర్ హీరోల్లో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన తొలి నటుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ‘గుంటూరు కారం’ సినిమాపై ఉన్న రూ.212 కోట్లు వసూళ్ల రికార్డును అధిగమించిన ఈ సినిమా, 2025 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. బ్లాక్‌బస్టర్ విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన వెంకటేష్‌, ఇప్పుడు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వెంకటేష్‌ అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్‌ను అక్టోబర్ 20 నుండి ప్రారంభించబోతున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా వెంకటేష్‌ ఓ సినిమా చేయనున్నారు.

editor

Related Articles