పాకిస్తాన్ ప్రముఖ నటి జవేరియా అబ్బాసీ బాల్యంలోనే వివాహం, ఆ తర్వాత విడాకులు, ఇప్పుడు రెండో పెళ్లి ..ఇవన్నీ కలిపి చూస్తే ఆమె లైఫ్ ఒక సినీ కథలా మారిపోయింది అని అంటున్నారు. 1997లో కేవలం 17 ఏళ్ల వయసులోనే జవేరియా తన సవతి సోదరుడు షమూన్‌ను పెళ్లి చేసుకోవడం ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ వివాహంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది వారు బయోలాజికల్ సోదర -సోదరీమణులు కాదని సమర్థించినా, సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వివాహ జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. జవేరియా -షమూన్‌లకు అంజెలా అనే కుమార్తె పుట్టగా, తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అప్పటి నుండి జవేరియా సింగిల్ మదర్‌గా తన కూతురిని పెంచుతూ జీవితం కొనసాగించారు.

- September 22, 2025
0
4
Less than a minute
Tags:
You can share this post!
editor