ఐదు రూపాయల చుట్టూ తిరిగే కథ

ఐదు రూపాయల చుట్టూ తిరిగే కథ

చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘కాయిన్‌’. జైరామ్‌ చిటికెల దర్శకత్వంలో శ్రీకాంత్‌ రాజారత్నం రూపొందిస్తున్నారు. బుధవారం హీరో చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ పోస్టర్ తో పాటు గ్లింప్స్ ను విడుదల చేశారు. పాత ఐదు రూపాయల కాయిన్‌ ఎందుకు బ్యాన్‌ అయిందనే నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని, కథలోని క్రైమ్‌ ఎలిమెంట్‌ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాయిన్‌ చుట్టూ ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిదని హీరో చంద్రహాస్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయిరాజేష్‌, సంగీత దర్శకుడు నిమిషి జాకియాస్‌ తదితరులు పాల్గొన్నారు.

editor

Related Articles