రెండు మూడు వేలకు మించి డ్రెస్సులకు పెట్టను!

రెండు మూడు వేలకు మించి డ్రెస్సులకు పెట్టను!

మృణాల్‌ ఠాకూర్ తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ‘సీతారామం’ ఫేమ్‌. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ ‌- అట్లీ కాంబో సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వరుస భారీ సినిమాలతో ఆర్థికంగా కోరుకున్న స్థాయికి చేరుకున్నప్పటికీ.. ఖర్చు విషయంలో మాత్రం పొదుపుగా ఉంటుందట ఈ హీరోయిన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా డబ్బుపై నియంత్రణ ఉండాలంటూ మృణాల్‌ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
‘నాకు ఖరీదైన డ్రెస్సులు కొనడం అస్సలు ఇష్టం ఉండదు. వాటి కోసం ఎంతో ఖర్చుపెడతాం. ఏదో ఒక సందర్భంలో ధరించడం తప్ప అవి ఎక్కువ కాలం బీరువాల్లోనే ఉండిపోతాయి. అందుకే దుస్తుల విషయంలో రెండు మూడు వేలకంటే ఎక్కువగా ఖర్చు చేయను. ఫిల్మ్‌ ఈవెంట్స్ కు మాత్రం కాస్త ఖరీదైన డిజైనర్‌ క్లాత్స్‌ ధరిస్తాను. అయితే వాటిని అద్దెకు తెచ్చుకుంటాను అని చెప్పుకొచ్చింది మృణాల్‌ ఠాకూర్‌.

editor

Related Articles