బాలీవుడ్ నుండి గ్లోబల్ స్టార్ గా ఎదిగింది ప్రియాంకచోప్రా. గత కొన్నేళ్లుగా హాలీవుడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ హీరోయిన్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో పాటు ‘క్రిష్-4’లో కూడా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలావుండగా పర్పుల్ పెబెల్ పిక్చర్స్ పేరుతో భర్త నిక్‌జోనస్‌తో కలిసి నిర్మాణ సంస్థను కొనసాగిస్తున్నది ప్రియాంక చోప్రా. ఇప్పటికే ఈ బ్యానర్ పై పలు సినిమాలను తెరకెక్కెంచింది. తాజా ఇంటర్వ్యూలో తాను నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించింది ప్రియాంకచోప్రా. బాలీవుడ్ లో అడుగుపెట్టిన రెండేళ్లలోనే అక్కడి పరిస్థితులు మొత్తం తనకు అర్థమయ్యాయని, సినీ నేపథ్యం లేకుంటే ఎంత చులకనగా చూస్తారో తెలిసిందని చెప్పింది. ‘బాలీవుడ్ లో వారసులదే హవా. బయటి వారు సక్సెస్ కావడం చాలా కష్టమైన పని. నేను ఎన్నో కష్టాలకోర్చుకొని అవకాశాలు సంపాదించా. నా ప్రయత్నాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. నాలా కొత్తవారెవరూ కష్టపడొద్దనే ఉద్దేశ్యంలో నిర్మాణ సంస్థను స్థాపించాను. అందులో న్యూటాలెంట్ ను ప్రోత్సహిస్తున్నా’ అని ప్రియాంకచోప్రా పేర్కొంది.

- September 16, 2025
0
6
Less than a minute
You can share this post!
editor