తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..

బాలీవుడ్ హీరోయిన్ నుండి గుడ్ న్యూస్ రానున్నదన్న టాక్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆ జంట మరెవరో కాదు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్. విక్కీ కౌశల్ తో 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వాడాలో వెడ్డింగ్‌ తర్వాత, కత్రినా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి, వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అప్పటి నుండే “కత్రినా గర్భవతి” అనే ఊహాగానాలు పలుమార్లు వినిపించాయి. అయితే వీటిని ప్రతిసారి కత్రినా – విక్కీలు ఖండిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో విక్కీ కౌశల్ స్వయంగా స్పందిస్తూ, “అలాంటిదేమీ లేదు. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా చెబుతాం,” అని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఆ రూమర్లు మాత్రం మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. కొందరు నెటిజన్లు ఆమె “తల్లి కాబోతున్నారేమో” అనే వార్తలు వెలుగు చూశాయి. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఈసారి మాత్రం “ఇది నిజమే కావచ్చు” అని గట్టిగానే చర్చ జరుగుతోంది. ఇంకా విక్కీ – కత్రినా జంట నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ జంట గురించి బాలీవుడ్ మీడియాలో మాత్రం జోరుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి తల్లి కాబోతున్నారన్న వార్తలపై కత్రినా ఎలా స్పందిస్తుందో, ఎప్పుడు అధికారికంగా చెబుతారో చూడాలి. కానీ అభిమానులు మాత్రం ఈ జంట నుండి గుడ్ న్యూస్ వచ్చే రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, క‌త్రినా ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించింది. తెలుగులో మ‌ల్లీశ్వ‌రి అనే సినిమాతో క‌త్రినా సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

editor

Related Articles