బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. సెలబ్రిటీలు, కామన్ పీపుల్ కలిసి పక్కాగా ఆట మొదలుపెట్టారు. ఇప్పటికే షో ప్రారంభమై అయిదు రోజులు ముగిసాయి. మొదటి వారం నామినేషన్ తో హౌస్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎలిమినేషన్ చర్చకు దారి తీసింది. ఎవరు హౌస్ నుండి బయటికెళ్తారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు చూస్తే.. శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. ఈ తొమ్మిది మందిలో ఒకరు ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవడం ఖాయం. సంజన ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమెకి కెప్టెన్ పదవి ఇచ్చారు. దీంతో మిగతా వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో ప్రత్యేక ఇంటర్వ్యూల కోసం రూపొందించిన షో “బిగ్ బాస్ బజ్” మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి హోస్ట్ గా ఎవరు వస్తారోనని జనం ఎదురుచూస్తుండగా, గత సీజన్ లో సత్తా చాటిన శివాజీ ఈ రోల్ ను చేపట్టడం ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ గా అనిపిస్తోంది. గత సీజన్-8లో అర్జున్ అంబటి హోస్ట్ గా వ్యవహరించగా, ఈ సీజన్ కు శివాజీ ఎంపిక కావడం విశేషం. బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ పేరుతో శివాజీ ఈసారి తనదైన స్టైల్‌లో షోను నడిపించబోతున్నారు. బిగ్ బాస్ బజ్ లో ఏముంటుంది అంటే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ను స్టూడియోకు ఆహ్వానించి, వారితో హౌస్ కి సంబంధించిన అనేక విషయాలు ఆరా తీయనున్నారు. ఎవరు కన్నింగ్ ఆట ఆడుతున్నారు?, ఎలిమినేట్ అయ్యే కారణాలేమిటి?, ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్స్?, లాంటి అనేక ఆసక్తికర ప్రశ్నలతో శివాజీ వేడి వారిలో గుబులు పుట్టించనున్నారు. ఇప్పటికే బజ్ కి సంబంధించి ప్రోమో విడుదల కాగా, ఇందులో శివాజీ తన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఫ్యాన్స్ ను అలరించారు. ఆయన హోస్టింగ్ కు విశేష స్పందన రావడం ఖాయం అంటున్నారు సినిమా వారు. మొత్తానికి, బిగ్ బాస్ 9 హౌస్ లో ఒకవైపు ఎలిమినేషన్ డ్రామా నడుస్తుండగా, మరోవైపు బిగ్ బాస్ బజ్ కూడా శివాజీ యాంకరింగ్ తో కొత్త టర్న్ తీసుకోనుంది. ఇప్పుడు ఆసక్తి అంతా మొదటి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గురించే? శివాజీ వారి వద్ద నుంచి ఏం రహస్యాలు రాబడతారు? అన్న దానిపై అందరిలో ఉత్కంట నెలకొని ఉంది.

- September 13, 2025
0
33
Less than a minute
You can share this post!
editor