టాలీవుడ్ యాక్టర్ మంచు లక్ష్మి గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఓ అభిమానిపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనను వెనుకనుండి టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఆమె ఎదురుగా వచ్చి మాట్లాడమని ఛాలెంజ్ చేశారు. ఈ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే దుబాయ్ వేదికగా జరిగిన సైమా 2025 అవార్డ్స్ వేడుకకి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. సెలబ్రిటీలను దగ్గరగా చూసేందుకు, సెల్ఫీలు తీయడానికి అభిమానులు ఎగబడ్డారు. లక్ష్మి కూడా అభిమానుల్ని నిరాశపరచకుండా, వారితో సెల్ఫీలు దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అదే సమయంలో, ఆమె వెనకవైపు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో అసభ్యకరంగా కామెంట్ చేయడంతో, మంచు లక్ష్మి క్షణాల్లోనే ఆగ్రహంతో స్పందించారు. “ఒరేయ్! దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడరా. నీకు బుద్ధిలేదురా!” అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి మంచు లక్ష్మికి మద్దతు వెల్లువెత్తుతోంది. “ఇలాంటి అసభ్యకర కామెంట్లు మానుకోవాలి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత కూడా మంచు లక్ష్మి మామూలుగా తన మూడ్ లోకి వచ్చి, అక్కడి అభిమానులతో సెల్ఫీలు, జోకులు షేర్ చేసుకున్నారు.
- September 9, 2025
0
100
Less than a minute
You can share this post!
editor

