‘కిష్కింధపురి’ రిలీజ్ డేట్ వచ్చేసింది…

‘కిష్కింధపురి’  రిలీజ్ డేట్ వచ్చేసింది…

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎప్పుడూ వినూత్న కథలని, కొత్త జానర్స్‌ని ఆదిరిస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా హర్రర్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆకర్షణ చూపే వీక్షకులకు ఇప్పుడు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు వస్తోంది ‘కిష్కింధపురి’. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ ఇప్పటికే సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాని యువ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ కాంబినేషన్ ఫస్ట్‌టైం కావడం, ఇద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్‌ పెంచేశాయి. టీజర్‌లో చూపించిన డార్క్ హర్రర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ విజువల్స్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ రిస్పాన్స్ తెచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి సినిమాపై ఆస‌క్తిని క‌లిగించాయి. హర్రర్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి త‌ప్ప‌క న‌చ్చేలా ఉంది. చివ‌ర్లో అనుప‌మ భ‌య‌పెట్టించేసింది. బెల్లంకొండ మ‌రోసారి త‌న ప‌వ‌ర్‌ఫుల్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుబోతున్నాడ‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుందని ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

editor

Related Articles