టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అప్పట్లో. అంతే కాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సమంతకి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపా దడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ సత్తా చాటుతోంది. కొంతకాలంగా సమంత – రాజ్ నిడిమోరు జంట ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లో కలిసి హాజరవడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో ఏర్పడింది. దుబాయ్ ట్రిప్‌ను ఒక్క నిమిషంలో చూపిస్తున్నా అంటూ సమంత షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని సమంత సందడి చేసింది. అయితే ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ అని ఫ్యాన్స్ మధ్య గుసగుసలు మొదలయ్యాయి. ఈ మధ్య ఇన్‌డైరెక్ట్‌గా తమ రిలేషన్ గురించి హింట్స్ ఇస్తోందని నెటిజన్స్ అంటున్నారు. సామ్ – రాజ్ రిలేషన్ చాలా దూరం వరకు వెళ్లిందని, త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోస్యాలు చెబుతున్నారు ఫ్యాన్స్.

- September 3, 2025
0
73
Less than a minute
You can share this post!
editor