ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ తెలపడం విశేషం. పవన్ కళ్యాణ్‌కి జన్మదిన శుభాకంక్షాలు. ఎంతోమంది ప్రజల హృదయాల్లో, మనస్సులలో మీరు చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయేను బలోపేతం చేస్తున్న మీరు దీర్ఘాయుష్షుతో సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు. హీరో అల్లు అర్జున్ కూడా తన మామ పవర్ స్టార్‌కి విషెస్ తెలియజేశారు. పవర్ స్టార్, డిప్యూటీ సీఎంకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
- September 2, 2025
0
100
Less than a minute
You can share this post!
editor


