క‌ర్ణాట‌క సీఎంని కలిసిన రామ్‌చ‌ర‌ణ్…

క‌ర్ణాట‌క సీఎంని కలిసిన రామ్‌చ‌ర‌ణ్…

హీరో రామ్‌చరణ్‌తో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా, గత కొన్నిరోజులుగా చిత్రబృందం సినిమా టైటిల్ సాంగ్‌కి సంబంధించిన భాగాలను చిత్రీకరిస్తోంది. అయితే శనివారం, అల్లు కనకరత్నమ్మ మరణంతో చిత్ర యూనిట్ తాత్కాలికంగా షూటింగ్‌కు విరామం పలికింది. అమ్మమ్మ ఆఖరిచూపు కోసం రామ్‌చరణ్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇక ఆదివారం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆహ్వానంతో రామ్‌చరణ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో చరణ్.. సిద్ధరామయ్యకు శాలువాకప్పి స‌న్మానం చేశారు. ఈ సందర్భంగా సీఎం కూడా రామ్‌చరణ్‌కి ఆత్మీయ స్వాగతం పలికారు.

editor

Related Articles