‘జిగ్రీస్’లో పాట రిలీజ్ చేసిన హీరో అబ్బవరం

‘జిగ్రీస్’లో పాట రిలీజ్ చేసిన హీరో అబ్బవరం

ప్రస్తుతం టాలీవుడ్‌లో  ఫ్రెండ్స్ కథలు హిట్ అవుతున్నాయి. ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్ లాంటి సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఆ లిస్ట్‌లోకే చేరుతుంది జిగ్రీస్ సినిమా. కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న జిగ్రీస్ సినిమాని హరీష్ రెడ్డి ఉప్పుల డైరెక్షన్ చేస్తుండగా కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు స్టార్స్ అందరూ సపోర్ట్‌గా నిలబడ్డారు. తాజాగా కిరణ్ అబ్బవరం జిగ్రీస్ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

editor

Related Articles