హీరో రవి మోహన్ ప్రతిభ ఈ ప్రపంచానికి తెలియాలని, ప్రజలు చూడాలని ప్రముఖ నేపథ్యగాయని కెనిషా ఫ్రాన్సిస్ అన్నారు. చెన్నైలో రవిమోహన్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరగ్గా అందులో కెనిషా పాల్గొని ప్రసంగిస్తూ, ‘నేను నేపథ్యగాయనిని. ఇండిపెండెంట్ సంగీత నృత్య కళాకారిణి. ఇపుడు రవి మోహన్ స్టూడియోలో భాగస్వామిని. ఈ అవకాశాన్ని కల్పించిన రవి మోహన్‌కు ధన్యవాదాలు. చాలాకాలంగా నేను ఒంటరిగా ఉంటున్నా. ఇప్పుడు రవి ద్వారా ఇంతమంది అందమైన మంచి మనుషులను చూడగలుగుతున్నా. ఈ స్టూడియోను మరింతగా విస్తరించాలని భావిస్తున్నా. అదే మా ఇద్దరి కల. అతను ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నారు. అతనిలో ఎంత బాధ ఉన్నప్పటికీ బయట పడరు. ఇప్పుడు రవికి చెందిన ఏడు స్ర్కిప్టులు నా వద్ద ఉన్నాయి. అతని ప్రతిభను ఈ ప్రపంచం చూడాలి. ఆయన విజయం సాధించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఆ విజయం కోసం ఆయన ఎంతగానో శ్రమిస్తూనే ఉన్నారు. రవి మోహన్ ఎంత మంచి వ్యక్తో ఆయన తల్లి వరలక్ష్మి గారిని కలిసి ఒకరోజు మాట్లాడితే తెలుస్తుంది. అలాంటి మంచి వ్యక్తిని కన్నందుకు ఆ వరలక్ష్మి అమ్మకు ధన్యవాదాలు అన్నారు. కాగా, రవిమోహన్ స్టూడియో ప్రారంభోత్సవంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, హీరోలు కార్తి, శివకార్తికేయన్, హీరోయిన్ జెనీలియా తదితరులు పాల్గొని విషెస్ చెప్పారు.

- August 30, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor