అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా

అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో సైన్స్ ఫిక్షన్ సినిమా

 హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న నిర్మాతలు, కాస్టింగ్ నుండి టెక్నికల్ టీమ్ దాకా ప్రతి అంశంలో రాజీలేకుండా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమాని తెర‌కెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తుండటం ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం, తమిళ కమెడియన్ యోగిబాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, నటి మృణాల్ ఠాకూర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. అలాగే, మృణాల్ ఠాకూర్ పాత్రకు సంబంధించిన డిటైల్స్ కూడా పెద్దగా బయటకు రాకపోవడంతో, ఆమె పాత్రపై కూడా కొంత ఉత్సుకత ప్రేక్షకులలో ఏర్పడింది.

editor

Related Articles