సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ కన్నుమూసారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆమె శుక్రవారం అర్ధరాత్రి 1.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94 ఏళ్లు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె పార్థీవదేహం అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కనకరత్నమ్మ మృతి వార్త తెలియగానే, రాంచరణ్, అల్లు అర్జున్ (బన్నీ) హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రస్తుతం అల్లు అరవింద్‌తో కలిసి హీరో చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇతర కుటుంబసభ్యులు హీరో పవన్ కళ్యాణ్, నాగబాబు తదితరులు వేరే కార్యక్రమాలలో ఉన్న కారణంగా వారు ఆదివారం అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలపనున్నారు. అల్లు కనకరత్నమ్మ మృతి వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలియజేస్తున్నారు.

- August 30, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor