‘ఒక వయసు వచ్చేవరకూ తల్లిదండ్రుల సహకారం ప్రతి ఒక్కరికీ అవసరమే. ఈ విషయంలో ఎవరూ మినహాయింపు కాదు..’ అంటున్నారు హీరోయిన్ శ్రీలీల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లితో తనకున్న అనుబంధాన్ని వివరించారామె. అలాగే కెరీర్ పట్ల తాను తీసుకున్న కొత్త నిర్ణయాన్ని కూడా తెలియజేశారు. ‘చాలా చిన్న వయసులోనే హీరోయిన్‌ను అయ్యాను. ఆ టైమ్‌లో సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. అందుకే నాతో పాటు అమ్మ కూడా లొకేషన్‌కి వచ్చేది. అలాగే నా కథలు కూడా అమ్మే వినేది. నా సినిమాలను కూడా అమ్మే నిర్ణయించేది. ఈ కారణంగా ఆమె కెరీర్ చాలా లాస్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా అమ్మ. కొన్ని నెలల క్రితం వరకూ కూడా అమ్మ పక్కన లేకుండా నిద్రపోయేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడే సోలో లైఫ్‌కి అలవాటు పడుతున్నా. అది కూడా అమ్మ నిర్ణయమే. ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకుండా ఉండాలన్నదే అమ్మ ఫిలాసఫీ. నిజానికి ఇకపై నిర్ణయం నాదే అయినా.. ఫైనల్ డెసిషన్ మాత్రం అమ్మదే సుమా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నా ప్రయాణాన్ని నేను చక్కబెట్టుకోవాలన్నదే అమ్మ ఆకాంక్ష. ఒక విధంగా మా అమ్మ నా బాధ్యతను పెంచింది.’ అంటూ శ్రీలీల చెప్పుకొచ్చారు.

- August 29, 2025
0
55
Less than a minute
You can share this post!
editor