చైతు సినిమాలోకి ‘లాపతా లేడీస్’ నటుడు!

చైతు సినిమాలోకి ‘లాపతా లేడీస్’ నటుడు!

అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇప్పుడు దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్‌లో చేస్తున్న అవైటెడ్ సినిమా గురించి తెలిసిందే. ఒక సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ సినిమా లాపతా లేడీస్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ జాయిన్ అయినట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేశారు. తనపై ఓ ఇంట్రెస్టింగ్ లుక్‌ని కూడా లాక్ చేసి విడుదల చేశారు. మరి ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా విరూపాక్ష నిర్మాత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా విరూపాక్ష, కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.

editor

Related Articles