జయం రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటుంన్నట్లు కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉంది. తన భర్త నుండి నెలకు రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు కోర్టులో ఉండగానే రవి తన స్నేహితురాలు, సింగర్ కెనీషాతో సన్నిహితంగా ఉంటున్నారు. చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే చాలా ఫంక్షన్స్లో వీరిద్దరూ కలిసి కనిపించారు. తాజాగా కెనీషాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రవి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అవుతుండటంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ఇష్యూపై ఆర్తి ఇన్స్టా వేదికగా స్పందించారు. ‘నువ్వు ఇతరులను మోసం చేయగలవు. నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు. కానీ పైనున్న ఆ భగవంతుడిని మోసం చేయలేవు’ అని స్టోరీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తన భర్త రవిని ఉద్దేశించే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

- August 26, 2025
0
61
Less than a minute
You can share this post!
editor