ఈ మధ్య నాకు నచ్చిన సినిమా ఇదే.. 3 BHK కి సచిన్ ప్రశంసలు కురిపించారు. గత నెలలో థియేటర్లలోకి వచ్చి ఫర్వాలేదనిపించుకున్న సినిమా (3 BHK). విడుదలైన అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆపై ఓటీటీలకి సైతం వచ్చిన ఈ సినిమా థియేటర్లకు మించి ఆదరణను దక్కించుకుంది. ఇంకా దక్కించుకుంటోంది. చిత్తా వంటి సెన్సిబుల్ థ్రిల్లర్ తర్వాత బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా నటించగా శరత్ కుమార్, చైత్ర జె అచార్, మితా రఘునాధ్, దేవయాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీ గణేశ్ దర్శకత్వం వహించాడు. ఓ మధ్య తరగతి కుటుంబం సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి తమ జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కి ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. అయితే ఇప్పడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా విశేష ఆదరణ పొందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీకి వచ్చి దాదాపు నెల గడుస్తుండగా తాజాగా ఇప్పుడు మరోసారి నేషనల్ వైడ్ ట్రెండింగ్‌కు వచ్చేసింది. అందుకు కారణం క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్. ఇటీవల రెడిట్‌లో అభిమానులతో చాటింగ్ చేసిన ఆయనకు ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో సినిమాలు ఏమైనా చూస్తారా అని ఫ్యాన్స్ నుంచి ప్రశ్న ఎదురైంది. అందుకు సచిన్ స్పందిస్తూ ఇటీవల 3 బీహెచ్‌కే సినిమా చూశానని నాకు బాగా నచ్చిందని చెప్పారు.

- August 26, 2025
0
61
Less than a minute
You can share this post!
editor