సినిమాల్లో యూనిక్ కాన్సెప్ట్‌లు, డిఫరెంట్ థాట్స్‌తో తనదైన ముద్ర వేసుకున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇటీవలి కాలంలో ప్రధాన పాత్రలో సినిమాలు చేయడం తగ్గించి గెస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ‘ఓమ్’, ‘ఏ’, ‘రా’, ‘హెచ్ 2ఓ’, ‘యూ ఐ’ వంటి విభిన్న సినిమాలతో హీరోగా, దర్శకుడిగా తన క్రియేటివిటీని నిరూపించుకున్న ఉపేంద్ర 56 ఏళ్ల వయసులోనూ అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఉపేంద్ర కుటుంబం వరలక్ష్మీ వ్రతం వేడుకని గ్రాండ్‌గా నిర్వహించింది. ఆయన భార్య ప్రియాంక త్రివేది తన సోషల్ మీడియా ఖాతాలో పండుగ సందర్భంగా కుటుంబ ఫొటోలు షేర్ చేయడంతో, అవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న ఉపేంద్ర దంపతులను చూసి అభిమానులు ముచ్చటపడిపోతున్నారు. ఉపేంద్ర భార్య ప్రియాంక త్రివేది .. ఓ బెంగాలీ నటి. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెద్దల ఆశీర్వాదంతో 2003లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రియాంక తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ మంచి గుర్తింపు పొందారు. జేడీ చక్రవర్తితో నటించిన ‘సూరి’ సినిమా, ఉపేంద్ర హీరోగా నటించిన ‘రా’, ‘హెచ్ 2ఓ’ వంటి చిత్రాల్లో ఆమె నటన మెప్పించింది.

- August 26, 2025
0
60
Less than a minute
You can share this post!
editor