అల్లు అర్జున్ కొత్త సినిమా లీక్ చేసిన..?

అల్లు అర్జున్ కొత్త సినిమా లీక్ చేసిన..?

పుష్ప 2′ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసే తదుపరి సినిమాల‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించిన బన్నీ, చివరికి డైరెక్టర్ అట్లీతో కలిసి భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్‌తో సంబంధం లేకపోయినప్పటికీ, బన్నీకి సన్నిహితుడైన నిర్మాత బన్నీవాసు ఈ సినిమా నిర్మాణ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా బ‌న్నీ వాసు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. టాలీవుడ్ సినీ వర్కర్స్ సమ్మె కారణంగా చిత్రబృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ప్రతిరోజు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ సినిమాకి ఈ తరహా కార్మికుల సమ్మె కారణంగా బ్రేక్స్ ఎంతో నష్టాన్ని కలిగించాయి. విదేశాల నుండి వచ్చిన టెక్నీషియన్లకు పనిలేకున్నా రోజువారీగా పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది,” అన్నారు. “ఇది సన్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కావడంతో, వారితో నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ఏదైనా సమాచారం బయటపెట్టాలంటే వారు అనుమతించాలి. అందుకే మేమంతా ఇప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తోంది,” అని చెప్పారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె నటించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే, ‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ వంటి హాలీవుడ్ బిగ్‌బడ్జెట్ సినిమాలకు పనిచేసిన ఓ ప్రముఖ టెక్నికల్ టీమ్ కూడా ఈ సినిమాకి పనిచేస్తోంది. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి త్వరలోనే అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుందని అంచనా. ఇక ‘పుష్ప 2’ హైప్ తర్వాత వస్తున్న సినిమా కావటంతో బన్నీ ఫ్యాన్స్‌కి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

editor

Related Articles