త్వరలో రిలీజ్ కానున్న ‘గుర్రం పాపిరెడ్డి’

త్వరలో రిలీజ్ కానున్న ‘గుర్రం పాపిరెడ్డి’

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా రూపొందుతున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మురళీమనోహర్‌ దర్శకుడు. వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) నిర్మాతలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుండి ఓ లిరికల్‌ సాంగ్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ‘ఏదోటి చేయ్‌ గుర్రం పాపిరెడ్డి..’ అంటూ సాగే ఈ పాటను సురేష్‌ గంగుల రాయగా, కృష్ణ సౌరభ్‌ స్వరపరిచారు. లక్ష్మీమేఘన, ఎంసీ చేతన్‌ ఆలపించారు. హీరో పాత్రను ఉత్తేజపరిచేలా ఈ పాట సాగింది. బ్రహ్మానందం, యోగిబాబు, ప్రభాస్‌శ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: అర్జున్‌ రాజా, సమర్పణ: డా.సంధ్య గోలీ.

editor

Related Articles