కమల్ హాసన్‌ థగ్‌లైఫ్‌ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్..

కమల్ హాసన్‌ థగ్‌లైఫ్‌ ఫెయిల్యూర్‌పై శృతిహాసన్..

మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్‌ హీరోగా నటించిన థగ్‌లైఫ్‌ బాక్సాఫీస్‌ వద్ధ ఊహించని విధంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో థగ్‌లైఫ్‌ ఫెయిల్యూర్‌ మీ తండ్రిపై ప్రభావం చూపుతుందా.? అని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో స్పందించింది.  తమిళ సూపర్ స్టార్ హీరో రజినీకాంత్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన  కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించింది శృతిహాసన్‌. కూలీ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ హీరోయిన్  కూలీ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో తన తండ్రి కమల్ హాసన్‌ గురించి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తున్నాయి. మణిరత్నం డైరెక్షన్‌లో కమల్ హాసన్‌ లీడ్ రోల్‌లో నటించిన థగ్‌లైఫ్‌ బాక్సాఫీస్‌ వద్ధ ఊహించని విధంగా బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్వ్యూలో థగ్‌లైఫ్‌ ఫెయిల్యూర్‌ మీ తండ్రిపై ప్రభావం చూపుతుందా.? అని అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ తనదైన శైలిలో స్పందించింది. పదేళ్ల క్రితం నంబర్స్‌కు సంబంధించిన చర్చ జరగలేదు. తన జేబులోని  డబ్బంతా సినిమాకే ఖర్చు పెట్టే మనస్తత్వం నుండి నాన్నగారు వచ్చారు. అంతేకాదు ఇది (నంబర్‌ గేమ్‌) నవతరం ధనవంతుల సమస్య అని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

editor

Related Articles