బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో ఆమె దక్షిణాదిన కూడా అదిరిపోయే ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. ఇక రణ్‌బీర్ కపూర్‌తో పెళ్లి తర్వాత ఆమె కొన్ని సెలెక్టివ్ సినిమాల్లో నటిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ వస్తోంది. అయితే, తాజాగా ఆమె ఓ అడల్ట్ సినిమాని ఫ్యాన్స్‌కు అందించేందుకు సిద్ధమైంది. అయితే, ఆమె అడల్ట్ సినిమాలో నటించదని.. దాన్ని ప్రొడ్యూస్ చేయనుందని తెలుస్తోంది. శ్రీతి ముఖర్జీ అనే డైరెక్టర్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేయనుందట అలియా. తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను అలియా ప్రొడ్యూస్ చేయనుందట. కొత్త నటీనటులతో కాలేజీ లైఫ్ నేపథ్యంలో ఈ సినిమా తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు బి టౌన్ వర్గాలు తెలిపాయి.

- August 14, 2025
0
72
Less than a minute
Tags:
You can share this post!
editor