‘కూలీ’ సినిమాను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్

‘కూలీ’ సినిమాను చూసిన ముఖ్యమంత్రి స్టాలిన్

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన కూలీ సినిమా నేడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీమియ‌ర్స్ నుండే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ వీక్షించారు. ఈ సినిమాను నిర్మాత క‌ళానిధి మార‌న్‌, ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌లతో క‌లిసి వీక్షించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

editor

Related Articles