సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 14 అంటే రేపు గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి టిక్కెట్లు. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (A) సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలుగులో ఉన్న పలు థియేటర్ల యాజమాన్యం థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకి పలు సూచనలు జారీ చేసింది. ఈ సినిమాకు 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి అనుమతిలేదని ప్రకటించింది. అలాగే వయస్సును ధృవీకరించే ఏదైన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు) తప్పనిసరి అని తెలిపింది.

- August 13, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor