‘పరమ్‌ సుందరి’ ఈ నెల 29న రిలీజ్..

‘పరమ్‌ సుందరి’ ఈ నెల 29న రిలీజ్..

ఢిల్లీ అబ్బాయి పరమ్‌, కేరళ అమ్మాయి సుందరి మధ్య ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ట్రైలర్‌ ఆద్యంతం వినోద ప్రధానంగా ఆకట్టుకుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, జాన్వీకపూర్‌ జంటగా నటించిన తాజా సినిమా ‘పరమ్‌ సుందరి’ ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకు పాటలు, ప్రచార చిత్రాలు భారీ హైప్‌ను క్రియేట్‌ చేశాయి. మ్యూజికల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. మంగళవారం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.  కేరళ తాలూకు విజువల్స్‌ కట్టిపడేశాయి. భిన్న సాంస్కృతిక నేపథ్యం కలిగిన ఓ జంట ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపమిదని చిత్ర దర్శకుడు తుషార్‌ జలోటా తెలిపారు. ఈ సినిమా వ్యక్తిగతంగా కూడా బాగా కనెక్ట్‌ అయిందని, తాను పోషించిన సుందరి పాత్ర తన దక్షిణాది మూలాలు, ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేసేలా ఉంటుందని జాన్వీకపూర్‌ తెలిపింది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

editor

Related Articles