సుమ భ‌ర్త‌ని తన్నిన ఆ హీరోయిన్..

సుమ భ‌ర్త‌ని తన్నిన ఆ హీరోయిన్..

సుమ భ‌ర్త‌, న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌ని యంగ్ హీరోయిన్ వ‌ర్ష బొల్ల‌మ్మ కాలుతో త‌న్నిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన వారంద‌రూ షాక్ అవుతున్నారు. అంత పెద్ద సీనియ‌ర్ నటుడిని అలా త‌న్న‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మేట‌ర్‌లోకి వెళితే వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్‌లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14 నుండి ఈ సిరిస్ ఈటీవి విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రీమియ‌ర్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా రాజీవ్ క‌న‌కాల సెట్‌లో తీసిన వీడియోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఇందులో రాజీవ్ క‌న‌కాల త‌న చేయిని అలా పెట్ట‌గా, వ‌ర్ష బొల్ల‌మ్మ కాలు పైకి లేపి రాజీవ్ చేతిని టచ్ చేస్తుంది. ఈ సరదా సన్నివేశంలో రాజీవ్ క‌న‌కాల నా చేతిని కానిస్టేబుల్ క‌న‌కం త‌న్నేసింది అంటూ  చెబుతాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తుండ‌గా, నెటిజ‌న్స్ కూడా ఈ వీడియోకి స‌ర‌దా కామెంట్స్  పెడుతున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కానిస్టేబుల్ కనకం ట్రైలర్‌ని లాంచ్ చేసి యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక అమ్మాయి గౌరవం పెంచేలా ఈ సిరీస్ ఉంటుంది. నాకు కానిస్టేబుల్ కనకం రోల్ ఇచ్చినందుకు డైరెక్టర్‌కి థాంక్యూ సో మచ్ అని వ‌ర్ష బొల్ల‌మ్మ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో పేర్కొంది. సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వర్ష, మేఘ అద్భుతంగా ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచారు. ఈ క్యారెక్టర్స్ గురించి నేను చెప్పను. మీరు డైరెక్ట్‌గా సిరీస్‌లోనే చూడాలి అని ద‌ర్శ‌కుడు అన్నారు. అమ్మోరు, అరుంధతి సినిమాల్ని చూసినప్పుడు ప్రేక్షకులకు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో  కానిస్టేబుల్ కనకం సినిమాని చూసిన‌ప్పుడు కూడా అలాంటి గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది అని ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ అన్నారు.

editor

Related Articles