కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాలతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమాను ప్రారంభించాడు. వెంకటేష్ మహా దర్శకత్వంలో రాబోతున్న తాజా సినిమా రావుబహదూర్. ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో సత్యదేవ్ రావు బహదుర్ అనే జమీందార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జీఎంబీ, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, చింత గోపాలకృష్ణ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. సత్యదేవ్ వృద్ధుడి పాత్రలో ఉండగా.. అతడి చుట్టూ చిన్నపిల్లలు ఉండడం చూడవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

- August 12, 2025
0
59
Less than a minute
Tags:
You can share this post!
editor