బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఉన్నది ఉన్నట్టు చెబుతుంది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ సినిమాల గురించి, నటన గురించి మళ్లీ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటేనే మార్పుల మయం అని, హీరోయిన్స్ విషయంలో పరిస్థితులకు తగ్గట్టు మార్పు సహజమే అని, అది అంగీకరించక తప్పదు అని.. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. కంగనా రనౌత్ ఇంకా మాట్లాడుతూ.. హీరోయిన్స్ లైమ్ లైట్‌లో ఉండాలంటే.. మార్పు స్వీకరించాలి. లేకపోతే ఫేడ్ అవుట్ అవుతారు అని ఆమె తెలిపింది. కంగనా ఇంకా ఏం కామెంట్స్ చేసింది అంటే.. ‘నేను నా చిన్నతనంలో చాలా అల్లరి చేసేదాన్ని. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. నా జీవితాన్ని మార్చేసింది మాత్రం సినిమాలే. నా కెరీర్ పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ కంగనా రనౌత్ తెలిపింది.

- August 10, 2025
0
81
Less than a minute
Tags:
You can share this post!
editor