అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా పరదా ఆగస్ట్ 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి రేపిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తేనే కథలోని గంభీరత, సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఓ గ్రామంలో పాత సంప్రదాయాల పేరుతో ఉన్న దురాచారాల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలో ఆడపిల్లలు బయటకు మొహం చూపించకుండా, పరదా కట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. అటువంటి సమాజంలో ఎదిగిన సుబ్బు పాత్రలో అనుపమ కనబడతారు. ఆ గ్రామంలో ఇంకెన్ని దురాచారాలు ఉన్నాయి? వాటిని సుబ్బు ఎలా ఎదుర్కొంది అనేది చిత్ర కథగా తెలుస్తుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే ఎమోషన్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కథతో ఉండడం సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆచారాల ముసుగులో నలిగిపోతున్న మహిళ తన గ్రామం నుండి తప్పించుకోవడం, ఆమెకు మరో ఇద్దరు మహిళలు తోడు కావడం.. వారి ద్వారా తన నిజమైన జీవితాన్నిఎలా కనుగొంది అనేది సినిమాలో ఆసక్తిగా చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి గుడ్ ఫీల్ కాన్సెప్టులని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి కథకి అనుపమ పరమేశ్వరన్ తోడు కావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు.

- August 10, 2025
0
117
Less than a minute
Tags:
You can share this post!
editor