‘ఫీనిక్స్’ తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది. హై యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్ వున్న సినిమా ఇది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సూర్య సేతుపతి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న సినిమా ఫీనిక్స్. ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్‌తో పాటు హై ఎమోషన్స్‌తో వుండబోతోంది. ఎకె బ్రేవ్‌మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్యలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫీనిక్స్ తెలుగులో రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనల్ అరసు గారికి, నిర్మాతలకి ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఫీనిక్స్ వండర్ఫుల్ సినిమా. విజయ్ సేతుపతి గారి అబ్బాయి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. అలాగే నా హస్బెండ్ డైరెక్టర్‌గా చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

- August 10, 2025
0
49
Less than a minute
Tags:
You can share this post!
editor