సంతోష్  శోభన్‌  ‘కపుల్‌  ఫ్రెండ్లీ’  టీజర్  రిలీజ్

సంతోష్  శోభన్‌  ‘కపుల్‌  ఫ్రెండ్లీ’  టీజర్  రిలీజ్

 టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘కపుల్‌ ఫ్రెండ్లీ’. ఈ సినిమాకు అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అజయ్‌ కుమార్‌ రాజు.పి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుండి మేక‌ర్స్ తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ మిడిల్‌క్లాస్ క‌ష్టాల‌ను తెర‌పై చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో నెల్లూరు కుర్రాడైన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ, సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్ (రాపిడో లాంటివి) చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి (మానస వారణాసి) అతని బైక్‌పై ప్రయాణిస్తుంది. అలా మొదట అపరిచితులుగా పరిచయమైన వీరిద్దరూ ఆ త‌ర్వాత ప్రేమలో ఎలా ప‌డ‌తారు ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది ఈ సినిమా.

editor

Related Articles