టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఆయన బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు మహేష్ నటించిన అతడు సినిమాని కూడా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు మహేష్ బర్త్ డే హంగామా రెండు తెలుగు రాష్ట్రాలలో ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇక మహేష్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకంక్షలు తెలిపారు. తన సోషల్ మీడియా వేదికగా మహేష్‌కి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తెలుగు సినిమాకి గర్వకారణంగా నిలిచిన మీరు అసాధారణ ప్రతిభ, ఆకర్షించే గుణంతో అభిమానుల హృదయాలు కొల్లగొడుతున్నారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మరింత యవ్వనంగా కనిపిస్తున్నారు. ఈ ఏడాది కూడా మీకు సంతోషం, విజయంతో పాటు ఆనందకరమైన క్షణాలతో కూడిన సంవత్సరం కావాలని ఆశిస్తున్నా అంటూ మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

- August 9, 2025
0
41
Less than a minute
Tags:
You can share this post!
editor