క‌ల్ట్ క్లాసిక్ ‘శివ’  త్వరలో రీ-రిలీజ్ ..

క‌ల్ట్ క్లాసిక్ ‘శివ’  త్వరలో రీ-రిలీజ్ ..

అక్కినేని నాగార్జున కెరీర్‌లో నిలిచిపోయే కల్ట్ క్లాసిక్ సినిమా ‘శివ’. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1989లో విడుదలై, తెలుగు సినిమా రంగానికి సరికొత్త దిశ చూపించింది. అప్పటివరకూ ఒకే తరహా ఫార్ములా సినిమాలతో కొనసాగుతున్న టాలీవుడ్‌కు కొత్త శకాన్ని పరిచయం చేసింది. అందుకే తెలుగు సినీ చరిత్రలో ‘శివ’కు ముందు, ‘శివ’ తర్వాత అనే భావన ప్రబలంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సంచలన సినిమా మళ్లీ తెరపైకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘శివ’ను 4K డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీ-రిలీజ్ చేయనున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. “హలో మై ఫ్రెండ్స్! మోస్ట్ ఐకానిక్ సినిమా ‘శివ’ని తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాం. 4K డాల్బీ అట్మాస్ సౌండ్‌తో విడుదల చేస్తాం. త్వరలో మీ ముందుకు రానుంది. ఆగస్ట్  14 నుండి కూలీ సినిమా ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్స్‌లో శివ ట్రైల‌ర్‌ని కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు అని చెప్పుకొచ్చాడు. శివ సినిమా రీ-రిలీజ్ కాబోతుందనే శుభవార్తతో పాటు.. కూలీ సినిమా థియేటర్‌లోనే శివ 4కె ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్లు 4K డాల్బీ అట్మోస్ సౌండ్‌తో ఈ ట్రైలర్ ఉండబోతుండ‌గా, ఈ ట్రైల‌ర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

editor

Related Articles