జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2’ విడుదలకు ఇంకో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. వార్ 2 సినిమా తారక్ నటిస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. అయితే సినిమా రిలీజ్ దాదాపు దగ్గరపడినప్పటికీ, ఒక్క పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ లోటు భర్తీ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్ట్ 10న హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా ‘వార్ 2’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. “ది మ్యాన్ ఆఫ్ మాసెస్ (ఎన్‌టిఆర్), ది గ్రీక్ గాడ్ (హృతిక్ రోషన్), ఒక ఎపిక్ నైట్ కోసం మీ క్యాలెండర్‌లో డేట్‌ని మార్క్ చేసి పెట్టుకోండి అని ఉత్సాహంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ప్రమోషనల్ ఈవెంట్ విజయవాడలో జరగనుందన్న వార్తలు గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా, చిత్రబృందం వాటిని ఖండించింది. చివరకు హైదరాబాద్‌లోనే ఈ గ్రాండ్ ఈవెంట్ జరపాలని భావించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
- August 9, 2025
0
132
Less than a minute
Tags:
You can share this post!
editor


