కన్నడ నటుడు రిషభ్ షెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘కాంతార చాప్టర్ -1. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమా నుండి ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ రుక్మిణి వసంత్‌ని పరిచయం చేశారు మేకర్స్. రుక్మిణి వసంత్ ఇందులో కనకవతిగా కనిపించబోతున్నట్లు ప్రకటించారు. హోంబలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాని నిర్మిస్తుండగా.. అజ్నిష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని కన్నడ భాషతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతోంది.

- August 8, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor